తెలుగు,కన్నడ ఆర్టిస్టుల మధ్య గొడవ
on Dec 30, 2024
ప్రముఖ టెలివిజన్ ఛానల్ ఈటీవీలో ప్రసారమయ్యే 'దావత్'(daawath)ప్రోగ్రాం ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే.సుమ(suma)వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రోగ్రాంని మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తుండగా డిసెంబర్ 31 కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది.
ప్రముఖ సినీ నటులు బ్రహ్మాజీ,రాజీవ్ కనకాల,సమీర్,హైపర్ ఆది తో పాటు పలు జబర్దస్త్ ఆర్టిస్ట్ లు, సీరియల్ ఆర్టిస్టులు కూడా పాల్గొన్నారు.వీళ్ళలో కన్నడ పరిశ్రమకి చెందిన నటీమణులు కూడా ఉన్నారు. కన్నడ లేడీ ఆర్టిస్ట్ మాట్లాడుతు నా మాతృ భాష కన్నడ అయినా కూడా ఇక్కడి దాకా వచ్చి మాట్లాడుతున్నానంటే చాలా గొప్ప విషయం అని చెప్పగానే ఒక తెలుగు ఆర్టిస్ట్ ఆమె చెప్పిన మాటలపై మాట్లాడుతు నువ్వు మాట్లాడే పది మాటల్లో ఎనిమిది బూతులు వస్తాయి అనగానే మీరు కన్నడ వచ్చి నేర్చుకొని నటించవచ్చుగా అని సదరు లేడీ ఆర్టిస్ట్ అనగానే నాకు ఆ భాష రానప్పుడు నేను కన్నడ వెళ్ళనని చెప్పాడు.అలాంటాప్పుడు నన్ను షో కి పిలవకండి మీ తెలుగు వాళ్ళని మాత్రమే పిలుచుకోండి అని ఆమె అంది. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read